“డిగ్రీ ఉంది ఉద్యోగం లేదు? ఇదీపరిష్కారం”

యువత కోసం వాస్తవిక కధనం

యువత తప్పకుండా చేయాల్సిన 9 వాస్తవిక దశలు

1️ డిగ్రీ కాకుండా నైపుణ్యానికి ఎందుకు విలువ పెరిగింది? (Include Previous Article)

2. “నాకు ఏది Interest ఉంది? అది ఏమిటి?” అని నిజంగా మీ మనస్సుతో వెతకండి? అది దొరికే వరకు ప్రయత్నిచండి తప్పు కాదు.

డిగ్రీ ఉంది ఉద్యోగం లేదు పరిష్కారం.డిగ్రీ పూర్తయిందని వెంటనే ఉద్యోగం రావాలి అనుకోవడం పెద్ద తప్పు.ముందుగా ప్రతి యువకుడు తనను తాను అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఒక్కటే  “నాకు నిజంగా ఏ పని చేయడం ఇష్టం?”

ఇది బయటవాళ్లు చెప్పే సమాధానం కాదు.ఫ్రెండ్స్, బంధువులు, సోషల్ మీడియా ప్రభావం కాదు.మీ మనస్సు ఇచ్చే నిజమైన సమాధానం.ఆ సమాధానం దొరకాలంటే కొంత సమయం తీసుకోవాలి,కొన్ని ప్రయత్నాలు చేయాలి,కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది.అవి తప్పులు కాదు… అనుభవాలు

ఈ ప్రశ్నలకు మీతో మీరు నిజాయితీగా సమాధానం చెప్పండి:

1. నేను రోజూ 3–4 గంటలు అలసట లేకుండా, ఉత్సాహంగా చేయగల పని ఏమిటి?
డబ్బు వస్తుందా? రాదా? అన్నది కాదు.చేస్తుంటే టైమ్ ఎలా గడిచిపోతుందో తెలియని పని ఏది?

2. నేర్చుకోవడం ఇష్టం ఉన్న విషయం ఏది?
ఎవరూ చెప్పకపోయినా,బలవంతం చేయకపోయినా,మీరు స్వయంగా తెలుసుకోవాలనుకునే అంశం ఏది?

3. 5 ఏళ్ల తర్వాత నన్ను నేను ఎక్కడ చూడాలనుకుంటున్నాను?
ఒక ఉద్యోగంలోనా? స్వంత పనిలోనా? లేదా ఇతరులకు మార్గదర్శకంగా నిలబడే స్థాయిలోనా?

ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దొరికితే మీ కెరీర్‌కు దిశ స్వయంగా స్పష్టమవుతుంది.

చాలా మంది యువత చేసే పొరపాటు ఏమిటంటే ఇతరుల కెరీర్‌ను చూసి అదే దారిలో నడవాలని ప్రయత్నించడం.కానీ గుర్తుంచుకోండి. Career అనేది Copy చేయడానికి కాదు… Build చేయడానికి.

ప్రతి వ్యక్తి నేపథ్యం వేరు. ప్రతి వ్యక్తి సామర్థ్యం వేరు. ప్రతి వ్యక్తి జీవితం వేరు.

మీ Interest స్పష్టంగా తెలిసిన తర్వాత అదే దిశలో స్కిల్ నేర్చుకోండి.చిన్న అడుగులతో ప్రారంభించండి.
తప్పులు జరిగితే భయపడకండి.ఎందుకంటే మీకు ఇష్టం ఉన్న పని అయితే మీరు వదిలిపెట్టరు. మళ్లీ లేచి ప్రయత్నిస్తారు.

డబ్బు మొదట రావొచ్చు… రాకపోవచ్చు.కానీ సరైన దిశలో చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు.ఈ రోజు మీరు తీసుకునే ఈ ఒక నిర్ణయమే మీ రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుంది.

3. Short-Term Courses మీద Focus చేయండి

2–4 సంవత్సరాలు డిగ్రీ చదివిన తర్వాత మళ్లీ ఇంకో డిగ్రీ చేయాలా?
ఇదే ప్రశ్న చాలా మంది యువతను గందరగోళంలో పడేస్తోంది. నిజం ఏంటంటే ఇంకో డిగ్రీ అవసరం లేదు.
అవసరం ఉన్నది ఉపయోగపడే స్కిల్.

ఈ రోజుల్లో కంపెనీలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి.మీ దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అనేది కాదు… మీరు ఏం చేయగలరు అనేదే ముఖ్యం.” అందుకే
3–6 నెలల Short-Term Practical Courses డిగ్రీల కంటే ఎక్కువ విలువ కలిగిస్తున్నాయి.

Short-Term Courses అంటే ఏమిటి?

ఇవి కేవలం సర్టిఫికెట్ కోసం చేసే కోర్సులు కాదు. ఇవి పని నేర్పించే కోర్సులు. అంటే:

  • మీరు నిజంగా చేయాల్సిన పనిని నేర్పిస్తాయి
  • మార్కెట్‌లో అవసరమైన స్కిల్స్‌పై ఫోకస్ చేస్తాయి
  • Theory కంటే Practical Practice మీద ఆధారపడతాయి

Degree vs Short-Term Course (నిజమైన తేడా)  డిగ్రీలో

  • ఎక్కువ Theory
  • తక్కువ Practical Exposure
  • Industry కి దూరంగా syllabus

Short-Term Course లో:

  • Real-world skills
  • Hands-on practice
  • Market-oriented learning

అందుకే చాలా మంది డిగ్రీ ఉన్నవాళ్లకు ఉద్యోగం రావడం లేదు, కానీ 3–6 నెలల స్కిల్ ఉన్నవాళ్లకు అవకాశాలు వస్తున్నాయి.

Real Projects ఎందుకు ముఖ్యమంటే?

సర్టిఫికెట్ ఎవరికైనా ఉంటుంది.
కానీ Project చేసిన అనుభవం అందరికీ ఉండదు.

మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తే:

  • మీరు సమస్యను ఎలా అర్థం చేసుకుంటారో తెలుస్తుంది
  • పరిష్కారం ఎలా ఆలోచిస్తారో తెలుస్తుంది
  • మీ ఆలోచనా శక్తి బయటపడుతుంది

Employers ఇదే చూడాలని కోరుకుంటారు.

Portfolio Build చేయడం అంటే ఏమిటి?

Resume లో “Course Complete చేశాను” అని రాయడం సరిపోదు. కానీ Portfolio లో:

  • మీరు చేసిన పనులు
  • మీరు solve చేసిన problems
  • మీ skill level
    స్పష్టంగా కనిపిస్తుంది.

Portfolio అంటే మీ మాటలకన్నా బలమైన ఆధారం.

Employers Certificates ఎందుకు చూడడం తగ్గించారు?

ఎందుకంటే:

  • Certificates కొనుక్కోవచ్చు
  • Marks మేనేజ్ చేయవచ్చు
  • Degree copy చేయవచ్చు

కానీ Skill Copy చేయలేరు. Project Experience fake చేయలేరు. అందుకే ఇప్పుడు:

“Show me your work” అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

Short-Term Course ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి

  • కోర్సు Market-relevant ఉందా?
  • Practical Projects ఉన్నాయా?
  • Portfolio Build చేయిస్తారా?
  • Completion తర్వాత ఏం చేయాలో Guidance ఉందా?

ఇవన్నీ ఉన్న కోర్సే నిజంగా ఉపయోగపడుతుంది.

ఈ మార్గం ఎవరికీ సరిపోతుంది?

  • Degree ఉన్నా job రాని వారికి
  • Late age అని భయపడుతున్న వారికి
  • Career restart చేయాలనుకునేవారికి
  • Middle-class youth కి

ముఖ్యంగా Time & Money రెండూ save చేయాలనుకునే యువతకు.

గుర్తుంచుకోండి (Powerful Line)

Degree మీకు qualification ఇస్తుంది… Skill మీకు livelihood ఇస్తుంది… Projects & Portfolio మీకు Career ఇస్తాయి.

ఈ రోజుల్లో ఎక్కువ చదవడం కాదు… సరైనది నేర్చుకోవడం ముఖ్యం. అందుకే ఇంకో డిగ్రీ కోసం ఎదురు

చూడకండి. Short-Term Skills నేర్చుకుని, Long-Term Career నిర్మించండి.

4. Job కోసం కాదు… Experience కోసం ప్రయత్నించండి

చాలా మంది Freshers చేసే పెద్ద తప్పు ఒక్కటే “Salary ఎంత?” అనే ప్రశ్నను ముందే అడగడం. ఈ ప్రశ్న తప్పు కాదు… కానీ తప్పు సమయంలో అడిగితే కెరీర్‌ను ఆలస్యం చేస్తుంది.

కెరీర్ ప్రారంభ దశలో ముందుగా అడగాల్సిన ప్రశ్న ఇది కాదు నాకు ఎంత ఇస్తారు?”

నిజంగా అడగాల్సిన ప్రశ్న నేను ఇక్కడ ఏమి నేర్చుకుంటాను?” ఎందుకంటే మీ మొదటి 1–2 సంవత్సరాలు డబ్బు సంపాదించే కాలం కాదు… మీ భవిష్యత్తులో పెట్టే పెట్టుబడి కాలం.

Freshers ఎందుకు వెనుకబడిపోతున్నారు?

ఎటువంటి Experience లేకుండా High Salary కోరడం వల్ల. కంపెనీ కోణంలో చూస్తే మీరు ఇంకా నేర్చుకునే స్థితిలో ఉన్నారు. అందుకే వారు డబ్బు కాదు… Value చూడాలనుకుంటారు.

Experience అంటే ఏమిటి?

Experience అంటే కేవలం కంపెనీ పేరు కాదు. అది:

* Real Work Exposure    * Mistakes చేసి నేర్చుకోవడం  * Team లో పని చేయడం

* Deadlines ఎదుర్కోవడం   * Clients తో కమ్యూనికేషన్         ఇవి అన్నీ బుక్స్ లో లేవు.

అందుకే ఈ అవకాశాలను వదలకండి

Internship మీరు పని నేర్చుకునే safest entry point. డబ్బు తక్కువైనా Learning ఎక్కువగా ఉంటుంది.

Apprenticeship Senior ల దగ్గర నిజంగా ఎలా పని చేయాలో నేర్చుకోవచ్చు.

Low Salary Job (Short Term) ఇది జీవితాంతం కాదు. కేవలం మీ Career కి stepping stone మాత్రమే. గుర్తుంచుకోండి. తక్కువ salary job అంటే తక్కువ విలువ కాదు. అది అనుభవం సంపాదించే అవకాశం.

1–2 Years Investment Period అంటే ఏమిటి?

మీ మొదటి 1–2 సంవత్సరాలు మీరు:

*Skill polish చేయాలి   * Real projects చేయాలి  * Mistakes చేయాలి   * Learn & Unlearn చేయాలి

ఈ కాలం మీ future income ని decide చేస్తుంది.

ఇప్పడు మీరు తక్కువగా సంపాదించవచ్చు. కానీ ఈ అనుభవం వల్ల మీ విలువ పెరుగుతుంది. తర్వాత
Salary గురించి మీరు అడగాల్సిన అవసరం ఉండదు. అవకాశాలే మీ దగ్గరకు వస్తాయి.

ఇది కష్టం కానీ ఇదే నిజం

  • Degree ఉన్నా Experience లేకపోతే — Zero
  • Skill ఉన్నా Experience లేకపోతే — Limited
  • Skill + Experience ఉంటే — Unlimited Opportunities

Middle Class Youth కి ఇది ఎందుకు అవసరం?

మనకి Strong Background ఉండదు. Recommendations ఉండవు. Backup Plans ఉండవు      మనకున్న ఒకే ఆయుధం Skill + Experience.

5. ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు

Parallel గా:   * Private skills   * Freelancing   * Online opportunities

ఒకే దారిలో కాదు. Multiple Doors Open చేయండి..

ప్రభుత్వ ఉద్యోగం మంచిదే.స్థిరత్వం ఉంటుంది.సమాజంలో గౌరవం ఉంటుంది.ఆర్థిక భద్రత కూడా ఉంటుంది.ఇందులో ఎలాంటి సందేహం లేదు.కానీ సమస్య ప్రభుత్వ ఉద్యోగంలో కాదు… అదే ఒక్కటే మార్గం అని నమ్మడంలో ఉంది.

Ground Reality ఏంటి?

ప్రతి సంవత్సరం లక్షల మంది యువత కొన్ని వేల ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు.

ఫలితం?

  • Attempts పరిమితం
  • Years years preparation
  • Selection మాత్రం చాలా మందికి రాదు

ఇది నిజం… చేదు నిజం.

Age Pressure & Mental Stress

Govt job preparation లో ఒక స్టేజ్ తర్వాత Age pressure మొదలవుతుంది.

“ఇంకా ఎంతకాలం చదవాలి?” “ఈ attempt కాకపోతే?” “ఇప్పుడు వయసు పెరిగిపోయింది…”

ఈ ప్రశ్నలే మానసిక ఒత్తిడికి (mental stress) కారణం అవుతాయి.కొంతమంది తమ విలువను కూడా ఈ ఒక exam తో కొలవడం మొదలుపెడతారు. ఇది చాలా ప్రమాదకరం.

ఒక Exam మీ జీవితాన్ని define చేయదు

మీరు fail అయ్యారంటే మీరు జీవితంలో fail అయ్యారు అన్న అర్థం కాదు.అది ఒక ప్రయత్నం ఫలితం మాత్రమే.కానీ చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక సంవత్సరాలు వృథా చేసుకుంటున్నారు.

Parallel Path ఎందుకు అవసరం?

ప్రభుత్వ ఉద్యోగానికి prepare అవ్వండి. ఎవరూ ఆపడం లేదు.కానీ అదే సమయంలో
Parallel గా ఇంకో దారి ఉండాలి.ఎందుకంటే జీవితం ఒక్క door మీద ఆధారపడేంత చిన్నది కాదు.

Parallel Options ఏవి?

Private Skills డిజిటల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి నేర్చుకుంటే ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉంటాయి.

Freelancing మీ స్కిల్ ఆధారంగా ఇంటి నుంచే ఆదాయం పొందే మార్గం.

Online Opportunities

Remote jobs, content creation, consulting, teaching ఇవి ఇప్పుడు నిజమైన కెరీర్ మార్గాలు.

ఇవన్నీGovt job preparation కి అడ్డంకి కావు. అదే సమయంలో Backup గా నిలుస్తాయి.

ఒకే దారిలో నడిచేవారు ఇరుక్కుంటారు

ఒకే దారి… ఒకే లక్ష్యం… ఒకే ఫలితం… ఇది రిస్క్. కానీ Multiple Doors Open చేసి పెట్టుకుంటే ఒక దారి మూసుకుపోయినా మరొక దారి తెరుచుకుంటుంది. అదే smart thinking.

Middle Class Youth కి ఇది ఎందుకు అవసరం?

మనకి Financial backup ఉండదు,Family pressure ఉంటుంది,Time value చాలా ముఖ్యమైంది.

అందుకే All eggs in one basket పెట్టడం మనకి ప్రమాదకరం.

Powerful Truth  గుర్తుంచుకోండి

Govt Job ఒక మంచి option. కానీ అది ఒక్కటే option కాదు. Stability ఒకదారిలో ఉండొచ్చు. Growth మరోదారిలో ఉండొచ్చు. తెలివైన యువత రెండింటినీ balance చేస్తారు.

Govt job వచ్చినా జీవితం ఉంది. Govt job రాకపోయినా జీవితం ఉంది. మీ జీవితం ఒక exam resultకన్నా చాలా పెద్దది.ఒకే దారిలో కాదు… Multiple Doors Open చేయండి. అదే మీ భవిష్యత్తుకు నిజమైన భద్రత.

మీ కోసం ఒక ప్రశ్న: మీ డిగ్రీ తర్వాత మీరు ఏ దిశలో వెళ్లాలని అనుకుంటున్నారు?

  • Skill-based career?
  • Govt + Parallel path?
  • Freelancing / Digital work?

Comment లో మీ ఆలోచన చెప్పండి. కలిసి చర్చిద్దాం.

……………………………..పరిష్కారం కోసం పూర్తి కధనం Next Article లో………

Scroll to Top