ప్రతి సంవత్సరం జనవరి 26 రాగానే మన దేశం మొత్తం ఒక ప్రత్యేకమైన ఉత్సాహంతో నిండిపోతుంది. జెండాలు ఎగురుతాయి, దేశభక్తి పాటలు వినిపిస్తాయి, టీవీల్లో పరేడ్ ప్రసారం వస్తుంది. కానీ చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది: “ప్రతి సంవత్సరం Republic Day ఎందుకు జరుపుకుంటాం? దీని అసలు ప్రత్యేకత ఏమిటి?” ఇది కేవలం సెలవు రోజు కాదు. ఇది మన దేశం ఎలా నడవాలి?ఎలా నడుచుకోవాలి అనే దానికి ఉన్న అత్యంత పవిత్రమైన గుర్తు.
ఈ రోజు గణతంత్ర దినోత్సవం 2026, 26 జనవరి ప్రాముఖ్యత, మనకు ఒక విషయాన్ని గట్టిగా గుర్తు చేస్తుంది. ఈ దేశం మనందరిది. ఈ దేశాన్ని నడిపేది చట్టం. ఈ దేశంలో అధికారం ఎవరి చేతుల్లో ఉన్నా, రాజ్యాంగం ముందు అందరూ సమానం.
Republic Day అంటే ఏమిటి?
Republic Day అంటే “గణతంత్ర దినోత్సవం”. మన దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందిన రోజు ఆగస్టు 15,1947 కానీ దేశం స్వతంత్రం కావడం ఒక విషయం, దేశం రాజ్యాంగం ఆధారంగా ప్రజల పాలనలోకి రావడం మరో విషయం. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజే భారతదేశానికి నిజమైన పండగ దినం. “ప్రజల చేతిలో ప్రజలే ఎలుకొనే గణతంత్ర దేశం”గా మారింది. అందుకే జనవరి 26ని Republic Day గా జరుపుకుంటాం.
ప్రతి సంవత్సరం Republic Day ఎందుకు ఏర్పాటు చేశారు?
Republic Day ని ప్రతి సంవత్సరం జరపడానికి కారణం ఒక్కటే కాదు. దీనిలో చాలా లోతైన అర్థం ఉంది.
1) రాజ్యాంగ విలువలను గుర్తు చేయడం
మన దేశం కేవలం భావోద్వేగాలతో నడిచేది కాదు. మన దేశం ఒక వ్యవస్థతో నడుస్తుంది. ఆ వ్యవస్థ పేరు రాజ్యాంగం. రాజ్యాంగం అంటే మన హక్కుల రక్షణ, మన బాధ్యతల గుర్తింపు, మన స్వేచ్ఛకు హద్దులు, మన దేశ పాలనకు నియమాలు. ప్రతి సంవత్సరం Republic Day జరుపుకోవడం ద్వారా “ఈ దేశం చట్టం ప్రకారం నడవాలి” అనే ఆలోచన ప్రజల్లో బలపడుతుంది.
2) ప్రజాస్వామ్య గౌరవాన్ని పెంచడం
Republic Day అంటే ప్రజాస్వామ్య పండుగ. ఎందుకంటే గణతంత్రంలో ప్రజలే అధికారులు. మనం ఓటు ద్వారా నాయకులను ఎన్నుకుంటాం. మన హక్కులను మనమే కాపాడుకుంటాం. ఈ రోజు మనకు ఒక సత్యం చెబుతుంది. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుండాలంటే బాధ్యతతో పాలకులు ఆలోచించాలి.
3) దేశ ఐక్యతను బలపరచడం
భారతదేశం అనేది ఒకే భాష కాదు, ఒకే సంస్కృతి కాదు, ఒకే ప్రాంతం కాదు. భారతదేశం అంటే అనేక భాషలు, అనేక సంప్రదాయాలు, అనేక జీవనశైలులు. కానీ మనందరినీ కలిపే ఒకే దారం ఉంది. అది భారతీయత. Republic Day రోజున జరిగే ప్రదర్శనలు ఈ ఐక్యతను ప్రపంచానికి చూపుతాయి.
4) యువతలో లక్ష్యం, క్రమశిక్షణ పెంచడం
Republic Day పరేడ్‌లో కనిపించే క్రమశిక్షణ, సమన్వయం, ధైర్యం యువతలో ఒక ప్రశ్నను లేవనేత్తుతుంది. “నేను నా జీవితంలో ఇంత క్రమశిక్షణగా ఉన్నానా?” ఒక దేశం ఎదగాలంటే యువత బలంగా ఉండాలి. యువత బలంగా ఉండాలంటే మనసు బలంగా ఉండాలి. ఈ రోజు మనకు ఆ బలం ఇస్తుంది.
Republic Day ప్రత్యేకత ఏమిటి?
Republic Day ప్రత్యేకత జెండాలు పెట్టడంలో మాత్రమే లేదు. ఈ రోజు ప్రత్యేకత “దేశం ప్రజల చేతిలో ఉంది” అనే భావంలో ఉంది. ఈ రోజు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మన దేశంలో ఎవరైనా గొప్పవాడు కావచ్చు, కానీ రాజ్యాంగం కంటే గొప్పవాడు ఎవ్వరూ కాదు. మన దేశం రాజుల దేశం కాదు, ప్రజల దేశం. మన దేశం బలవంతుల చేతిలో ఉండదు, చట్టం చేతిలో ఉంటుంది. అందుకే ఈ రోజు ప్రత్యేకం.
ప్రతి సంవత్సరం Republic Day లో ఏమేమి ప్రదర్శిస్తారు? ప్రత్యేకతలు ఏమిటి?
Republic Day వేడుకలు సాధారణంగా దేశ రాజధాని న్యూఢిల్లీ లో జరుగుతాయి. ఇందులో ప్రధానంగా నాలుగు రకాల ప్రదర్శనలు ఉంటాయి. ప్రతి దానికి ప్రత్యేకత ఉంటుంది.
- సైనిక పరేడ్ (Military Parade)
ఇది Republic Day లో అత్యంత గంభీరమైన భాగం. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన తమ శక్తిని, క్రమశిక్షణను, సిద్దంతాన్ని చూపిస్తాయి. ఈ పరేడ్ చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటే అదే మన దేశం శాంతిని కోరుతుంది, కానీ భద్రత విషయంలో రాజీ పడదు. సైనికుల అడుగుల శబ్దం ఒక హెచ్చరికలా ఉంటుంది. దేశం మీద కన్నేస్తే భారతవని నిద్రపోదు అనే సందేశం ఇందులో ఉంటుంది. - ఆయుధాలు, రక్షణ సామగ్రి ప్రదర్శన
ఈ ప్రదర్శనలో ఆధునిక రక్షణ వ్యవస్థలు, వాహనాలు, ప్రత్యేక దళాల సామగ్రి కనిపిస్తుంది. ఇది మన దేశం అభివృద్ధిలో కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, భద్రతలో కూడా బలపడుతోంది అని తెలియజేస్తుంది. యువతకు ఇది ఒక ప్రేరణ ఇస్తుంది. దేశానికి సేవ చేయడం అంటే కేవలం మాటలు కాదు, అవసరమైతే ప్రాణం వదిలే ధైర్యం కూడా ఉండాలి. - చిత్రరథాలు (Tableaux)
Republic Day లో అందరూ ఎక్కువగా ఎదురుచూసేది చిత్రరథాలు. ప్రతి రాష్ట్రం, కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు తమ సంస్కృతి, అభివృద్ధి, చరిత్ర, విజయాలను ఒక కథలా చిత్రరథాల్లో చూపిస్తాయి. ఒక చిత్రరథం అంటే కేవలం అలంకరణ కాదు. అది ఒక రాష్ట్రం యొక్క ఆత్మను చూపించే వేదిక.
వ్యవసాయం, మహిళా శక్తి, పర్యాటకం, గిరిజన సంస్కృతి, ఆధునిక సాంకేతికత, విద్య, ఆరోగ్యం
వంటి అంశాలు చిత్రరథాల్లో కనిపిస్తాయి. ఇవి మనకు ఒక విషయాన్ని బలంగా చెబుతాయి భారతదేశం ఒకేలా ఉండదు,అంటే సర్వ మతాలు,వారి సంస్కృతుల సమ్మేళనం భారతదేశం.కానీ సమస్య వచ్చినపుడు అందరూ కలిసి ఎకమవుతారు, భారతమాత గొంతుకలవుతారు.
- సాంస్కృతిక ప్రదర్శనలు (సుమారు 2,500 మంది కళాకారులు)
Republic Day లో సాంస్కృతిక ప్రదర్శనలు అనేవి దేశ హృదయం లాంటివి. సుమారు 2,500 మంది కళాకారులు పాల్గొని భారత సంస్కృతిని నృత్యం, సంగీతం, శారీరక విన్యాసాల ద్వారా ప్రదర్శిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఒకే వేదికపై భారతదేశం మొత్తం కనిపిస్తుంది. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులు తమ శైలిలో దేశభక్తిని చూపిస్తారు. ఇది చూసినప్పుడు మనకు ఒక గర్వం వస్తుంది. మన దేశం ఎంత గొప్ప సంపదను కలిగిఉందో తెలుస్తుంది.
సాంప్రదాయ నృత్యాల ప్రత్యేకత
సాంప్రదాయ నృత్యాలు అంటే మన దేశం యొక్క జీవిత చరిత్ర. ఇవి కేవలం వినోదం కాదు. ఇవి మన మూలాలను గుర్తు చేస్తాయి. ప్రతి నృత్యంలో ఒక కథ ఉంటుంది, ఒక భావం ఉంటుంది, ఒక త్యాగం ఉంటుంది.
మోహినియాట్టం ప్రత్యేకత
మోహినియాట్టం కేరళకు చెందిన శాస్త్రీయ నృత్యం. దీని ప్రత్యేకత మృదుత్వం. ఈ నృత్యం కదలికల్లో ఒక ప్రవాహం ఉంటుంది. ముఖభావాల్లో ఒక ప్రశాంతత ఉంటుంది. మోహినియాట్టం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటే బలం అంటే కేవలం శబ్దం కాదు, బలం అంటే శాంతంగా నిలబడే ఆత్మవిశ్వాసం. ఇది యువతకు ఒక గట్టి సందేశం ఇస్తుంది. నీలో బలం ఉంటే నీ ప్రవర్తనలోనే కనిపిస్తుంది.
సంగీత ప్రదర్శనల ప్రత్యేకత
Republic Day లో సంగీతం ఒక శక్తి. దేశభక్తి గీతాలు వినిపించినప్పుడు మన హృదయం ఉప్పొంగుతుంది. బ్యాండ్ వాయిద్యాలు ఒకే తాళంలో సాగితే మనకు ఒక విషయం తెలుస్తుంది. సమన్వయం ఉంటే ఏదైనా సాధ్యం. సంగీతం మనలోని అలసటను తీసేస్తుంది. మనలోని భయాన్ని తగ్గిస్తుంది. మనలోని దేశ ప్రేమను పెంచుతుంది.
శారీరక నృత్యాలు, ఫిజికల్ డిస్ప్లేలు ప్రత్యేకత
శారీరక విన్యాసాలు చూసినప్పుడు మనకు ఒకటే ఫీలింగ్ వస్తుంది అదే “మన శరీరం కూడా ఒక ఆయుధం.” క్రమశిక్షణ, శక్తి, ఫిట్‌నెస్, సమన్వయం ఇవన్నీ ఈ ప్రదర్శనల్లో కనిపిస్తాయి. యువతకు ఇది ఒక సూటి సందేశం నువ్వు బలంగా ఉండాలంటే నీ శరీరం మాత్రమే కాదు, నీ మనసు కూడా బలంగా ఉండాలి.
Republic Day 2026 థీమ్ ఏమిటి?
Republic Day 2026 (26 జనవరి 2026) కోసం ప్రకటించిన ప్రధాన థీమ్ “వందే మాతరం 150 సంవత్సరాలు” అనే దిశగా ఉండబోతుందని వార్తా నివేదికలు, ప్రభుత్వ సమాచారం ద్వారా తెలుస్తోంది. వందే మాతరం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. ఈ థీమ్ అర్థం దేశాన్ని ప్రేమించడం మాటల్లో కాదు, పనుల్లో చూపించాలి. ఈ థీమ్ ఆధారంగా చిత్రరథాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి అనే అంశాలను మరింత బలంగా చూపించేలా రూపొందిస్తారు.
ఈ రోజు యువతకి అసలు కిక్ ఏమిటి?
Republic Day చూసి మనం ఒక్క ప్రశ్న అడగాలి నేను నా దేశానికి ఏమిచ్చాను?
దేశం కోసం చేయాల్సింది పెద్ద పని మాత్రమే కాదు. చిన్న పని కూడా పెద్దదే. నిజాయితీగా ఉండడం, క్రమశిక్షణగా ఉండడం, చదువులో ముందుకు వెళ్లడం, ఆరోగ్యంగా ఉండడం, ఇతరులను గౌరవించడం, సమాజానికి ఉపయోగపడడం ఇవన్నీ దేశ సేవే.
నువ్వు మారితే నీ జీవితం మారుతుంది. నీ జీవితం మారితే నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారితే నీ ఊరు మారుతుంది. నీ ఊరు మారితే దేశం మారుతుంది.ఇదే Republic Day ఇచ్చే నిజమైన సందేశం.
ఇంకా ఒక విషయం మనం స్పష్టంగా గుర్తు పెట్టుకోవాలి. Republic Day అంటే కేవలం రాజధానిలో జరిగే పరేడ్ మాత్రమే కాదు. ఇది దేశం మొత్తం ఒకే ఆలోచనతో ఒక్కటిగా నిలబడే రోజు. ఈ రోజున మనం చూసే ప్రతి ప్రదర్శన వెనుక ఒక సందేశం ఉంటుంది. అది మనకు కనిపించని క్రమశిక్షణను, కనిపించని శ్రమను, కనిపించని త్యాగాన్ని గుర్తు చేస్తుంది. ఒక సైనికుడు గంటల తరబడి నిలబడి పరేడ్‌లో అడుగు వేస్తాడు. ఒక కళాకారుడు నెలల తరబడి సాధన చేసి ఒక నిమిషం ప్రదర్శన చేస్తాడు. ఒక రాష్ట్రం తన చిత్రరథం కోసం రోజులు కష్టపడి రూపకల్పన చేస్తుంది. ఈ అన్నింటి వెనుక ఉన్న నిజం ఏమిటంటే దేశం కోసం పనిచేసే మనసు ఉన్నప్పుడు మాత్రమే దేశం ముందుకు వెళ్తుంది.
మనకు ఈ రోజు ఇంకో గొప్ప పాఠం కూడా చెబుతుంది. మన దేశం గొప్పదిగా కనిపించడానికి కారణం కేవలం పెద్ద భవనాలు కాదు, పెద్ద మాటలు కాదు. మన దేశం గొప్పదిగా నిలబడటానికి కారణం ప్రజల్లో ఉండే బాధ్యత భావం. ప్రతి పౌరుడు తన పనిని నిజాయితీగా చేస్తే దేశం మారుతుంది. విద్యార్థి చదువును గౌరవిస్తే దేశం మారుతుంది. యువకుడు అలసత్వాన్ని వదిలి లక్ష్యంతో ముందుకు నడిస్తే దేశం మారుతుంది. ఉద్యోగి సమయాన్ని విలువైనదిగా భావిస్తే దేశం మారుతుంది. ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించవచ్చు, కానీ దేశ నిర్మాణం చిన్న అలవాట్లతోనే మొదలవుతుంది.
ఈ Republic Day నాడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మన జీవితంలో ఒక కొత్త క్రమశిక్షణను మొదలుపెట్టాలి. రోజూ ఒక మంచి అలవాటు పెంచుకోవాలి. రోజూ ఒక చెడు అలవాటు తగ్గించుకోవాలి. రోజూ దేశం గురించి ఒక మంచి ఆలోచన చేయాలి. దేశాన్ని ప్రేమించడం అంటే నినాదాలు చేయడం మాత్రమే కాదు. దేశాన్ని ప్రేమించడం అంటే మన పని మనం సరిగ్గా చేయడం. అదే నిజమైన దేశభక్తి. అదే Republic Day మనకు ఇచ్చే అసలు బహుమతి.
ముగింపు
Republic Day అనేది ఒక రోజు కాదు. ఇది ఒక భావన. ఇది ఒక పిలుపు. ఇది ఒక బాధ్యత. ఈ రోజు మనలో దేశభక్తిని పెంచుతుంది. మనలో క్రమశిక్షణను పెంచుతుంది. మనలో లక్ష్యాన్ని పెంచుతుంది. ఈ Republic Day నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నేను నా జీవితాన్ని బాగుచేస్తాను. నేను నా కుటుంబాన్ని బాగుచేస్తాను. నేను నా దేశానికి ఉపయోగపడతాను.
బారత్ మాతాకి జై… ఇపుడే ఈ Republic Day నిజంగా అర్థవంతం అవుతుంది.
…..Happy Republic Day …జై హింద్.

